జ్యోతిష్య శాస్త్రం వ్యక్తి యొక్క మానసిక స్థితిని గురించి ఏమి చెప్తుంది? – 5

మకరం : ఇది పృథ్వి తత్వ రాశి, ఎప్పుడు ఎదో ఒక పనిలో నిమగ్నమయి ఉంటారు. చాలా సులువుగా నిర్ణయాలు మార్చుకోగలరు.

అధిపతి శని. వీరికి పోరాడేతత్వం ఎక్కువ, పనులు పూర్తి చేయడంలో సిద్దహస్తులు.

చర రాశి. పనులు పూర్తి చేయడానికి ఎంచుకునే మార్గంలో సామాన్యులకు సాధ్యతరం కానిదిగా ఉంటుంది.

రాశి గుర్తు మొసలి – ఎంతటి కష్టానైనా భరించి అవకాశం కోసం పొంచి చూసే తత్వం వీరిది.

కార్యదీక్షత పట్టుదలతో ఇతరులతో అభిప్రాయాలతో సంబంధం లేకుండా పనులు పూర్తి చేయాలి అంటే వీరు ఉండాలి.

కుంభం : ఇది వాయు తత్వ రాశి. ఎదుటివారి కోసం కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది. వీరికి పరిశోధన అంటే ఇష్టం.

అధిపతి శని. సాంఘిక కార్యక్రమంలో ఎక్కువగా పాల్గొంటారు. సంఘంలో అసమానతలు వీరికి నచ్చవు.

స్థిర రాశి. వీరు నిజమైన ప్రేమను కనబరుస్తారు. ఇష్టమైన వారి కోసం వారి ఇష్టాలను కూడా వదులుకుంటారు.

రాశి గుర్తు నిండు కుండ – ఇతరులకు ఎప్పుడు సహాయ పడుతుంటారు.

సాంఘిక కార్యక్రమాలకు, పరిశోధనలకు వీరి సహాయం ఉపయోగపడుతుంది.

మీనం: ఇది జల తత్వ రాశి. వీరు ప్రస్తుతం కన్నా గతంలో ఎక్కువగా జీవిస్తారు, తరచూ ఊహల్లో ఏకాతంగా విహరిస్తారు.

అధిపతి గురువు. వీరికి ఆధ్యాత్మిక విషయాలలో ఆసక్తి ఎక్కువ. వీరు ప్రాపంచిక విషయాలను ఎక్కువగా పట్టించుకోరు.

ద్విస్వభావ రాశి. ఎప్పుడు ఎన్నో ఆలోచనలతో ఉంటారు, నిర్ణయానికి తొందరగా రాలేరు.

రాశి గుర్తు మీనం (చేపల జంట) – వీరు ఎప్పుడు ఎదో ఒక ఆలోచన లేదా పనిలో నిమగ్నమై ఉంటారు.

నైతిక బలం అందించడంలో వీరు సిద్దహస్తులు. సలహాదారులుగా వీరి సలహాలు అమోఘం.

మేషం(Aris) | వృషభం (Taurus) | మిధునం (Gemini) | కర్కాటకం (Cancer) | సింహ (Lio) | కన్య (Virgo) | తుల (Libra) | వృశ్చిక (Scorpio) | ధనుస్సు (Sagittarius) | మకరం (Capricon) | కుంభం (Aquarius) | మీనం (Pisces)

Post Comments
Loading Facebook Comments ...