జ్యోతిష్య శాస్త్రం వ్యక్తి యొక్క మానసిక స్థితిని గురించి ఏమి చెప్తుంది? – 4

తుల : ఇది వాయు తత్వ రాశి, పనులను త్వరగా పూర్తి చెయ్యాలని భావిస్తారు. పనులలో జాప్యాన్ని ఇష్టపడరు.

అధిపతి శుక్రుడు – వీరికి వంటరితనం నచ్చదు, ఎప్పుడూ మిత్రులతో, బంధు వర్గంతో, విందులు వినోదాలలో పాల్గొనాలని అనుకుంటారు.

చర రాశి – వీరు అందరిపట్ల సమ భావన కలిగి ఉంటారు. వీరికి కళలు అంటే ఎక్కువ ఇష్టం, వాటిలో ప్రవేశం కూడా ఉంటుంది. వీరు ఆలోచనలను, మనసును తొందరగా మార్చుకోగలరు. వీరికి కోపం తొందరగా వస్తుంది, తొందరగా పోతుంది. కొన్ని సమయాలలో పనులను పూర్తికాకముందే మధ్యలొ విడిచిపెడతారు.

రాశి గుర్తు తులా దండం – వీరు న్యాయం వైపు ఉండాలనుకుంటారు. వీరి ఊహలు కొన్నిసార్లు అతిశయముగా ఉండును.వీరికి ప్రేమ వ్యహారములందు ఆసక్తి ఎక్కువ.

పనులను కొత్తగా చెయ్యాలన్నా, కల్పనా శక్తితో చెయ్యాలన్నా వీరి సహాయం ఉపయోగపడుతుంది.

వృశ్చికం: ఇది జల తత్వ రాశి, వీరిలో ప్రేమ, ద్వేషం, కోపం ఏదైనా తీవ్ర స్తాయిలో ఉంటాయి.

అధిపతి కుజుడు – వీరికి పోరాడే తత్త్వం ఎక్కువ. అనుకున్నది సాధించేవరకు ఎంత ప్రయత్నం ఐనా చేస్తారు.

స్థిర రాశి – వీరు ఒకసారి నిర్ణయించుకుంటే ఆ నిర్ణయాలను తొందరగా మార్చుకోరు. వీరు తొందరగా ఎవరిని నమ్మరు, వీరు ఇతరులకు అంత అనుకూలముగా ప్రవర్తించారు.

రాశి గుర్తు తేలు – వీరి మాటలలో, ప్రవర్తనలో కరుకుదనం కనిపిస్తుంది.

వీరు రహస్య పనులు చేయడానికి ఇష్టపడుతారు. ఏదైనా రహస్యాన్ని ఛేదించడంలో వీరి సహాయం ఉపయోగపడుతుంది.

ధనుస్సు: ఇది అగ్ని తత్వ రాశి, వీరికి స్వతంత్రగా ఉండటం అంటె ఇష్టం. వీరు ఒకరి ఆజ్ఞలకు లోనై పనులను చేయలేరు, అలా అని వీరు ఇతరులను అజ్ఞాపించ ఇష్టపడరు.

అధిపతి గురుడు – వీరు బోధనయందు ప్రీతి కలిగి ఉంటారు. పెద్దవారితో స్నేహం చేస్తారు. కొంచం తెలిసిన విషయం గురించైనా చాల సమయం దాని గురించి చర్చించగలరు.

ద్విస్వభావ రాశి – వీరి ఆలోచన ఎప్పుడు ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం, పైకి కోపం కనపరచినా, అది లోపల ఏమాత్రం ఉండదు. వీరికి ఆలోచనా శక్తి ఎక్కువ. జరుగబొయెవటిని ఊహించగలరు.

రాశి గుర్తు ధనుస్సు- వీరిని నమ్మి ఏ విశాయమునైనా చర్చించవచ్చు. వీరు చాలా నమ్మకస్తులు.

సలహాలు ఇవ్వడం లో వీరు నిపుణత కనపరుస్తారు.సంధి చెయ్యడంలో వీరికి నైపుణ్యం ఉంటుంది.

మేషం(Aris) | వృషభం (Taurus) | మిధునం (Gemini) | కర్కాటకం (Cancer) | సింహ (Lio) | కన్య (Virgo) | తుల (Libra) | వృశ్చిక (Scorpio) | ధనుస్సు (Sagittarius) | మకరం (Capricon) | కుంభం (Aquarius) | మీనం (Pisces)

Post Comments
Loading Facebook Comments ...