ఉగాది

మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షాలు

ఉగాది తెలుగువారికి కొత్త సంవత్సరం ఆరంభాని సూచిస్తుంది, ప్రతి సంవత్సరం ఒక పేరుతొ పిలవబడుతుంది ఈ సంవత్సరం పేరు “హేవిళంబి”.

పురాణాల ప్రకారం బ్రహ్మ దేవుడు ఈ రోజే సృష్టి ఆరంభించాడు.

ఉగాది రోజు చేయవలసినవి

* అభ్యంగ స్నానం.
* ఇష్ట దైవ ఆరాధన.
* ఉగాది పచ్చడి సేవించడం.
* ఇంటి పైన ధ్వజం ఎగురవేయాలి.
* పంచాంగ శ్రవణం.

# ఉగాది రోజున సూర్యోదయం తో నిదుర లేచి తలంటుకొని స్నానం చేసి, కొత్త బట్టలు కట్టుకోవాలి.

# మన ఇష్ట దైవాన్ని పూజించుకోవాలి, దీనితో పాటు బ్రహ్మ దేవుని స్మరించుకోవాలి.

# ఉగాది పచ్చడి విశిష్టత

“ఉగాది పచ్చడి” ఈ పండుగకు మాత్రమే ప్రత్యేకమైన ఒక తినే పదార్ధం.షడ్రుచుల సమ్మేళనం – తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్దతిలో ఉప్పు, వేపపువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమిరప కాయలు, మామిడి చిగుళ్ళు మరియు అశోక చిగుళ్ళు వేసి చేస్తారు. ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

త్వామష్ఠ శోక నరాభీష్ట మధుమాస సముద్భవ !
పిబామి శోక సంతప్తాం మమ శోకం సదా కురు !!

ఈ మంత్రం చదువుతూ ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెప్తున్నాయి.

* బెల్లం – తీపి – ఆనందానికి సంకేతం
* ఉప్పు – జీవితంలో ఉత్సాహమ, రుచికి సంకేతం
* వేప పువ్వు – చేదు -బాధకలిగించే అనుభవాలు
* చింతపండు – పులుపు – నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు
* పచ్చి మామిడి ముక్కలు – వగరు – కొత్త సవాళ్లు
* మిరియాలు – కారం – సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు

# ప్రతి ఒక్కరు తమ ఇంటి పైన కాషాయ ధ్వజం ఎగురవేయాలి.

# ఉగాది పంచాంగ శ్రవణం.
కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతుల లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండటానికి పంచాగశ్రవణాన్ని చేస్తారు. పంచాంగ శ్రవణంలో తిథి,వార, నక్షత్ర, యోగ, కరణ ఫలితాన్ని తెలుసుకోవడం ద్వారా గంగాస్నానం చేసినంత పుణ్యాన్ని పొందవచ్చని పెద్దలంటారు. పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలు చేసుకోడానికి మంచి రోజులు లాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి పంచాంగ శ్రవణం జరుపుతారు.

Post Comments
Loading Facebook Comments ...